పొలిటికల్ బ్యూరో (సర్కార్): తల్లి బిడ్డ ఎవరికి వారే… ఒకరేమో ఎస్సై పై చేయి చేసుకోగా మరొకరేమో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. వారెవరో మాములు వ్యక్తులనుకుంటే పొరపాటే . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య ఒకరైతే వారి కూతురు షర్మిల (Ys Sharmila) మరొకరు షర్మిలేమో ఎస్ ఐ తో పాటు ఓ కానిస్టేబుల్ పై చేయి చేసుకోగా తల్లి విజయమ్మ ఓ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. కాగా షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. తన కుతూరును చూడటానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తల్లి విజయమ్మ తన కూతురులాగే తనను అడ్డుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడం తెలంగాణ లో చర్చనీయాంశంగా మారింది. తల్లి కూతుళ్లు ఇద్దరు తమను అడ్డుకున్న పోలీసులపై చేయిచేసుకోవడం వల్ల తీవ్ర విమర్శలపాలవుతున్నారు .