సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కట్?

మహబూబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా కవిత?

మాలోతు కవిత వైపు మొగ్గుచూపుతున్న బిఆర్ఎస్ అధిష్టానం?

ప్రస్తుత ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం

 

పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: మహబూబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ అధిష్టానం మొండిచేయి చూపనుందా? ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీ కి టికెట్ ఇవ్వనుందా? శంకర్ నాయక్ కంటే కవిత వైపే అధిష్టానం ఎందుకు మొగ్గుచూపుతోంది? మహబూబాద్ జిల్లా అధ్యక్ష పదవి శంకర్ నాయక్ కు అధిష్టానం ఎందుకు కేటాయించలేదు? ఇలా అనేక ప్రశ్నలు మహబూబాద్ బిఆర్ఎస్ కార్యకర్తల్లో మెదులుతున్నట్లు తెలుస్తోంది. మహబూబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి తిరుగులేని నేతగా ఎదిగిన శంకర్ నాయక్ కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మహబూబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గా శంకర్ నాయక్ ను నిలబెడితే ఓటమి తప్పదని,నిత్యం వివాదాల్లో చిక్కుకోవడం, నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత మొదలవడం ఇతరత్రా అంశాలు …ప్రస్తుత ఎమ్మెల్యే కు ఇబ్బందికరంగా మారినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల బిఆర్ఎస్ అధిష్టానం చేపించిన రహస్య సర్వే సిట్టింగ్ ఎమ్మెల్యే కు పూర్తి వ్యతిరేకంగా వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మహబూబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోతు కవిత ను ఎమ్మెల్యే గా పోటీచేపించడం ద్వారా బిఆర్ఎస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాలోతు కవిత గతంలో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించడం ,జిల్లాలో ఆమెకు క్లిన్ ఇమేజ్ ఉండటం,నియోజకవర్గంలో ప్రజల మంచిచెడులకు చేదోడువాదోడుగా ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశం. బిఆర్ఎస్ అధిష్టానం కనుక మహబూబాద్ ఎమ్మెల్యే గా మాలోతు కవిత ను బరిలోకి దింపితే బిఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందని తద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలను కోలుకోలేని దెబ్బతీసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట.ఇటీవలే సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవాలని శంకర్ నాయక్ ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది అడ్డుకోవడం కేసీఆర్ చూసిచూడనట్లు వ్యవహరించడానికి కూడా అదే కారణం కావొచ్చని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది.ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు శంకర్ నాయక్ కు టికెట్ కట్ చేసి మాలోతు కవిత కు కనుక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే శంకర్ నాయక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *