- ఉద్యోగులు, ఎంవిఐ ల వసూళ్లకు చెక్ పెట్టేనా?
- “ప్రజాసర్కార్ “కథనంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉద్యోగులు, ఎంవిఐ లు ?
- వసూళ్ల వ్యవహారం మేడం దృష్టికి పోవడంతో కంగారు?
- నిజాయితీ ఆఫీసర్ (ఆర్టీఓ) కు పరీక్షలా మారిన కార్యాలయ ఉద్యోగుల వసూళ్లు?
వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. “ఆర్టీఓ” కు తెలియకుండా ఉద్యోగులు, మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు బహిరంగంగానే ప్రైవేట్ అసిస్టెంట్లను నియమించుకొని వసూళ్లకు తెగబడుతున్నారు. ఇప్పటివరకు ఏ జిల్లాలో విధులు నిర్వర్తించినా.. అక్రమ వసూళ్లకు చెక్ పెట్టడంలో ప్రస్తుత “ఆర్టీఓ” ( అఫ్రిన్ సిద్దిఖీ ) సక్సెస్ అయ్యారు. ప్రస్తుత ఆర్టీఓ మేడం గత చరిత్ర తెలుసుకుంటున్న వరంగల్ జిల్లా వాసులు అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఇక్కడ జరుగుతున్న దోపిడీని కూడా కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. జిల్లాలోని కొందరు వాహనదారుల కోరిక మేరకు వరంగల్ ఆర్టీఏ కార్యాలయం లోపల, బయట జరుగుతున్న అక్రమ వసూళ్లను “ప్రజాసర్కార్” “మేడం జీ జర దేఖో” అనే కథనం ద్వారా ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్లే యత్నం చేసింది. ఆర్టీఓకు తెలియకుండా కార్యాలయం లోపల, బయట జరుగుతున్న దోపిడీని ఇప్పటికైనా “ఆర్టీఓ” అడ్డుకుంటారా ? లేదా? అనేది ఈ రోజు తేలనుంది.
కార్యాలయంలో కలకలం..
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం “ప్రజాసర్కార్” లో “మేడం జీ జర దేఖో” అనే వచ్చిన కథనం కలకలం రేపినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఆర్టీఓకు తెలియకుండా ఎలాంటి జంకూ లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడిన ఉద్యోగులు, ఎంవీఐల్లో ఇప్పుడు “ప్రజాసర్కార్” కథనంతో కలవరం మొదలైంది. ఆర్టీఓకు వసూళ్ల వ్యవహారం తెలియడంతో ఉద్యోగులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లలో షాక్ కు గురైనట్లు సమాచారం. అసలే ఆర్టీఓకు అవినీతి అన్నా, అవినీతికి పాల్పడే ఉద్యోగులన్నా నచ్చదు. అలాంటి నిజాయితీ ఆఫీసర్(ఆర్టీఓ) సారథ్యంలో విధులు నిర్వర్తిస్తూ కూా వాహనదారుల నుంచి యథేచ్ఛగా అదనపు వసూళ్లకు పాల్పడుతూ.. ఆమె పాలనను అబాసుపాలు చేస్తున్న వీరి వ్యవహారం ఆర్టీఓకు తెలియడంతో.. మన వసూళ్లు ఇకపై నడిచే అవకాశం లేదని ఉద్యోగులు, ఎంవీఐలు లోలోపల కుమిలిపోతున్నారట.