కానీ ఇది ప్రైమ్ లైట్.. కొన్ని షరతులు వర్తిస్తాయి..
Amazon Prime Lite: ఆమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ధర చాలా రోజులుగా రూ. 999 గా ఉంది. కానీ, గత సంవత్సరం ఈ ధరను ఏకంగా రూ.1499 కి పెంచారు. దాంతో, చాలా మంది మెంబర్షిప్ ను రెన్యువల్ చేసుకోవడానికి వెనుకడుగు వేశారు. ఫలితంగా అమెజాన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుదలతో మందగమనం కనిపించింది. దీంతో కొత్తగా అదే రూ. 999 లకు ఆమెజాన్ ప్రైమ్ లైట్ పేరుతో కొత్త మెంబర్షిప్ ను ప్రారంభించారు.
Amazon Prime Lite స్కీమ్ గురువారం నుంచి భారత్ లో అమల్లోకి వచ్చింది. ఈ ఆమెజాన్ ప్రైమ్ లైట్ లోనూ ఆమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో ఉన్న దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, కొన్ని బెనిఫిట్స్ మాత్రం ఈ ప్రైమ్ లైట్ ఉన్నవారికి అందవు. ఆమెజాన్ ఇండియా వెబ్ సైట్ లేదా ఆమెజాన్ యాప్ ద్వారా ఈ ప్రైమ్ లైట్ ప్లాన్ ను సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
Amazon Prime Lite details: ప్రైమ్ లైట్ వివరాలు
ఆమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ కేవలం రూ.999 లకే లభిస్తుంది. ఇది సంవత్సరం వరకు వాలిడిటీతో ఉంటుంది. ఆమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్స్ కు రెండు రోజుల ఉచిత డెలివరీ, అలాగే ఉచిత స్టాండర్డ్ డెలివరీ ప్రయోజనాలు ఉంటాయి. నో రష్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే రూ.25 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 5% క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రైమ్ లైట్ మెంబర్స్ కు కూడా ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ లైటెనింగ్ డీల్స్ (lightning deals) ఎర్లీ యాక్సెస్ ప్రయోజనం ఉంది. అయితే, వీరికి ఉచిత వన్ డే, సేమ్ డే డెలివరీ సదుపాయం మాత్రం ఉండదు.
benefits: రెండు డివైజెస్ లోనే..
ఆమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్స్ ఆమెజాన్ ప్రైమ్ (Amazon Prime video) లో అన్ లిమిటెడ్ వీడియోస్, మూవీస్, టీవీ షోస్ వీక్షించవచ్చు. అయితే, ఈ అవకాశం వారికి రెండు డివైజెస్ లోనే, హెచ్డీ క్వాలిటీతో లభిస్తుంది. సాధారణంగా ఆమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఆరు డివైజెస్ లో ప్రైమ్ కంటెంట్ ను వీక్షించే అవకాశముంటుంది. ప్రైమ్ లైట్ మెంబర్స్ కు ఆ నెంబర్ ను ఏకంగా రెండుకు తగ్గించేశారు. ప్రైమ్ లైట్ మెంబర్లకు ప్రైమ్ వీడియో కంటెంట్ లో యాడ్స్ కూడా ఉండనున్నాయి. ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ అడ్వాంటేజ్ బెనిఫిట్స్ మొదలైనవి ప్రైమ్ లైట్ సబ్ స్క్రైబర్లకు ఉండవు.