వర్ధన్నపేట నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన వైనం ?
నియోజకవర్గంలో వెంటిలేటర్ పై కాంగ్రెస్… ?
క్షేత్ర స్థాయిలో పట్టులేని బిజెపి?
2024 ఎన్నికల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఆరూరి రమేష్ గెలిచే అవకాశం ?
పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇప్పటికే రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేష్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని బి ఆర్ ఎస్ కార్యకర్తలు గట్టిగానే నమ్ముతున్నారట. నియోజకవర్గంలో ఆరూరికి తిరుగులేదని ప్రతిపక్షాలు ఆయనను ఓడించడం అసాధ్యమని మెజార్టీ వర్గాల నుండి వస్తున్న అభిప్రాయం . మరి 2024 ఎన్నికల్లో ఆరూరి గెలుస్తారా? కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఎదుర్కొని విజయం సాధిస్తారా? నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కు కలిసొచ్చే అంశాలేంటి? “ప్రజా సర్కార్” పొలిటికల్ బ్యూరో ప్రత్యేక విశ్లేషణ…
ఆరూరి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 90 వేల మెజారిటీ తో గెలిచి రాష్ట్రంలో హరీష్ రావు తర్వాత స్థానంలో నిలిచిన నాయకుడు.నియోజకవర్గంలోని ప్రజలను తన సొంత కుటుంబంగా చూసుకుంటూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో ఆరూరి తర్వాతే ఏ నాయకుడైన అనడంలో అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమేష్ నియోజకవర్గ ప్రజల నుండి ఓట్లు రాబట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం స్వంత పార్టీ నుండి కానీ ప్రతిపక్షాల నుండి కానీ తనను ఢీకొనే నేత లేకుండా చేయడం ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను కనీసం మండల స్థాయి లీడర్లు కూడా లేని పార్టీగా చేసి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేసిన ఆరూరి అభివృద్ధిలో తన మార్క్ ను చూపిస్తున్నాడు. నియోజకవర్గంలో స్వంత పార్టీలో ఎదురులేకపోవడం కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం,బీజేపీ కి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం ఆరూరి రమేష్ కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు .అంటే రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట బాద్ షా గా “ఆరూరి” అవతరించడం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని తెలుస్తోంది .
అనుకూల అంశాలు…
1.స్వంత పార్టీలో వర్గపోరు లేకపోవడం
2.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం
3.ఆరూరి గట్టమల్లు ఫౌండేషన్ ద్వారా యువతకు ఉచిత శిక్షణ ఇప్పించడం
4.ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం
5.కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వలేమి?
6.బిజెపి కి నియోజకవర్గంలో పట్టులేకపోవడం తదితర అంశాలు ఆరూరి గెలుపునకు దోహదం చేస్తాయని చెప్పవచ్చు