bridge collapses in bihar

నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన బ్రిడ్జి

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది, ఈ సంఘటనపై విచారణ ప్రారంభించాలని భవన నిర్మాణ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అధికారి తెలిపారు. భాగల్‌పూర్‌ను ఖగారియా జిల్లాలతో కలిపే అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన కూలిపోయిన ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన చెప్పారు.

“అగువానీ-సుల్తంగంజ్ నిర్మాణంలో ఉన్న వంతెన నాలుగు-ఐదు స్తంభాలు గంగా నదిలో కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది” అని సదరు అధికారి తెలిపారు.

భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ PTIతో మాట్లాడుతూ , “ అగువానీ-సుల్తంగంజ్ నిర్మాణంలో ఉన్న వంతెనలోని 4-5 స్తంభాలు కూలిపోయినట్లు నాకు సమాచారం అందింది. పరిపాలన సంబంధిత శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ అంశంపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రత్యయా అమృత్‌ను ఆదేశించారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఈ ఘటన తెలియజేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అన్నారు. “ బ్రిడ్జి నిర్మాణానికి తక్కువ ప్రమాణాలతో కూడిన మెటీరియల్స్ ను ఉపయోగించారు. బీహార్ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి కనీసం పట్టింపు లేదు… ఆయన పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. కాగా గత ఏడాది నవంబర్‌లో నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక భాగం కూలిపోవడంతో ఒక కార్మికుడు మరణించగా, మరొకరు గాయపడడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *