- మరో ఇద్దరు పరారీ
- వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్
వరంగల్: గంజాయి స్మగ్లింగ్ కు పాల్ప డుతున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్, ఆత్మ కూరు పోలీసులు ఉమ్మడిగా అరెస్టు చేశా రు. నిందితుడి నుంచి రూ.24లక్షల విలు వైన 120కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగ నాథ్ సోమవారం సీపీ కార్యాలయంలో వెల్లడించారు. ములుగు జిల్లా పందికుం ట గ్రామానికి చెందిన చెక్క కుమార స్వామి( 38), కారును కొనుగోలు చేసి కిరాయిల కు నడిపించి డబ్బు సంపాదించేవాడు. నిందితుడు కారుతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నింది తుడు గత 8ఏళ్లుగా ఒడిశా రాష్ట్రంలోని కలిమెల ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి దానిని పెద్ద మొత్తానికి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేడు.
కుమార స్వామి పలుమార్లు ఒడిశా నుంచి హైదరాబాద్ కు కూడా గంజా యి ని కారులో తరలించాడు. నిందితుడు పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు కూ డా వెళ్లాడు. మహా రాష్ట్ర పూణేలోని ఎర వాడ జైలులో 30నెలల పాటు శిక్షను అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక అతడిలో ఎలాంటి మార్పు రాకపోకపోగా తిరిగి గంజాయి స్మగ్లిం గ్ కు సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఆదివారం ప్రస్తుతం పరారీ లో ఉన్న మరో నిందితుడు ఒడిశా రాష్ట్రాని కి చెందిన గణేష్ అలియాస్ గన్ను వద్ద 120 కిలోల గంజాయిని కొనుగొలు చేసి వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకెట్ల లోకి మార్చి తన కారులో భద్రపర్చి మరో నిందితుడు దుప్పటి మోహ న్ అలియాస్ చింటూ సహకారంతో గం జాయిని ఏటూరునాగారం, వరంగల్, హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందింది. ఉదయం ఆత్మకూ ర్ మండలం కటాక్షపూర్ చెరువు ప్రాం తంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కుమార స్వామి కారును అడ్డుకోగా కారు డ్రైవర్ దుప్పటి మోహన్ పరారయ్యాడు. ప్రధాన నిందితు డు చెక్క కుమారస్వామిని అదుపు లోకి తీసుకొని కారును తనిఖీ చేయగా అందులో గంజాయిని స్వాధీనం చేసు కొని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు చెక్క కుమా ర స్వామిపై గతంలో మహబూబూబాబాద్ ములుగు జిల్లాలతో పాటు, మహారాష్ట్రలో కేసులు నమోద య్యాయి. ఈ గంజాయి స్మగ్లర్ ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్, లవన్ కుమార్, నిస్సార్ పాషా, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్లు సురేష్, ప్రభా కర్, మహ్మద్ పాషా, శ్యాం, కరుణాకర్, నాగరాజును సీపీ అభినందించారు.