dasara ott release date fixed

ఓటీటీలోకి “దసరా”.! ఎప్పుడో తెలుసా?

dasara ott release date fixed : నాచురల్ స్టార్ నానిచ‌ కీర్తి సురేష్ జంట‌గా, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం “దసరా” ఇటీవ‌ల విడుద‌లైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ పలు చోట్ల థియేట్రికల్ రన్ ని విజయవంతంగా కొనసాగిస్తుండగా, గత కొన్ని రోజుల క్రిత‌మే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ వచ్చింది.

ఈ సినిమా మే లో రావచ్చని టాక్ రాగా, ఇప్పుడు ఈ సినిమా అధికారిక డేట్ తెలిసింది. సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ లో.. స‌ద‌రా సినిమా ఈ ఏప్రిల్ 27 నుంచే స్ట్రీమింగ్ కి రానున్నట్లు గా స్ప‌ష్ట‌మైంది. ద‌స‌రా సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూసే.. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మించిన విష‌యం తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *