దాస్యం కు భరోసా..

హన్మకొండ జిల్లాలో తొలి టికెట్ ప్రకటించిన కేటిఆర్

వినయ్ భాస్కర్ ను గెలిపించాలని పిలుపు

పశ్చిమ బి ఆర్ ఎస్ టికెట్ పై ఊహాగానాలకు చెక్

ఎదురులేని నేతగా వినయ్ భాస్కర్?

టికెట్ పోరులేదు.. నియోజకవర్గంలో తిరుగులేదు

 

పొలిటికల్ బ్యూరో/(ప్రజాసర్కార్) : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ గులాబీ కార్యకర్తల్లో కెటిఆర్ పర్యటన జోష్ నింపినట్లు కనపడుతుంది. హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేటిఆర్ గత కొన్నిరోజులుగా పశ్చిమ టికెట్ పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది .పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ ను 70 వేల మెజారిటీ తో గెలిపించాలని కేటిఆర్ కోరడంతో హన్మకొండ జిల్లా లో తొలి టికెట్ ప్రకటించినట్లయింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేస్తున్న పోరాటానికి వెన్నుదన్నుగా నిలబడ్డ వినయ్ తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక కేటిఆర్ కు జిల్లాలోనే అత్యంత నమ్మకమైన నేతగా(రాముడికి హన్మంతుడిలా) గుర్తింపు పొందారు.పశ్చిమ టికెట్ విషయంలో కుట్రలు జరుగుతున్న విషయాన్ని(వినయ్ భాస్కర్ పై జరుగుతున్న కుట్రలను) పసిగట్టిన కేటీఆర్ శుక్రవారం జరిగిన బహిరంగ సభలో వినయ్ భాస్కర్ పశ్చిమ అభ్యర్థిగా ప్రకటించేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరడంతో వినయ్వినయ్ పై కుట్రలు పన్నుతున్న నేతలకు పరోక్షంగా షాక్ తగిలినట్లయింది. నియోజకవర్గంలో ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వినయ్ కి రానున్న ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టమేమి కాదని కాంగ్రెస్, బిజెపి పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలు కూడా వినయ్ భాస్కర్ కు కలిసొచ్చే అంశమని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వినయ్ భాస్కర్ డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ కార్యకర్తలు ధీమాగా ఉన్నారు.

ఊహాగానాలకు చెక్..

పశ్చిమ నియోజకవర్గంలో గత కొంతకాలంగా టికెట్ పై వస్తున్న ఊహాగానాలకు నిన్నటి కేటిఆర్ బహిరంగ సభతో చెక్ పడ్డట్లయింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ టికెట్ పై మరో ఇద్దరు నేతల కన్నుపడిందని వారు కెసిఆర్ కు అత్యంత సన్నిహితులని కనుక వినయ్ భాస్కర్ కు ( Dasyam vinay bhaskar) ఈసారి టికెట్ కష్టమేనని జోరుగా ప్రచారం సాగింది .కానీ శుక్రవారం హన్మకొండ లో జరిగిన బహిరంగ సభలో కెటిఆర్ వినయ్ భాస్కర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడంతో ఊహాగానాలకు చెక్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *