ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 18 మంది అదనపు ఎస్పీ ర్యాంకు అధికారులను ఎస్పీ (నాన్ క్యాడర్) స్థాయికి, 37 మంది డీఎస్పీ ర్యాంకు అధికారులకు అదనపు ఎస్పీ (నాన్ క్యాడర్) స్థాయికి తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతి కల్పించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ విషయాన్ని అంజనీ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం 18 మంది అదనపు ఎస్పీలను ఎస్పీగా, 37 మంది డీఎస్పీలను ఎస్పీ స్థాయికి పదోన్నతి కల్పించడం ఆనందంగా ఉంది. అందరికీ హృదయపూర్వక అభినందనలు. పోలీసు అధికారులు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.