నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలు అరెస్టు 

రూ.2కోట్ల విలువైన నకిలీ విత్తనాల స్వాధీనం

వరంగల్: వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్క్ ఫోర్సు, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో క లిసి అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి రూ.2కోట్ల 11లక్షల విలువైన నకిలీ విత్తనాలు.. ఏడు టన్నుల విడి విత్తనాలు, 9,765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, ఒక డీసీఎం వాహనం, ఒక కారు, రూ.21లక్షల నగదు, అలాగే నకిలీ విత్తనాల ప్యాకెట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠా సభ్యుల్లో దాసరి శ్రీనివాస్- కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, చేదాం పాండు-హైదరాబాద్, కొప్పుల రాజేష్- మంచిర్యాల్, వడిచర్ల సురేందర్ రెడ్డి- చంద్రపూర్, మహరాష్ట్ర, . ఏన్గూడే దిలీప్- బలార్ష, మహరాష్ట్ర, బోగే సత్యం- మంచిర్యాల, షేక్ అన్జద్- మంచిర్యాల, ఇందుర్తి వెంకటేష్- మంచిర్యాల, పుట్ట రాజేశం- మంచిర్యాల, చేదాం వెంకటరమణ- హైదరాబాద్, చేదాం నాగరాజు- మహబూబాబ్నగర్, సుందర్ శెట్టి ఫణీందర్- బాపట్ల, ఆంధ్రప్రదేశ్, కాల్వ శ్రీధర్- నాగర్ కర్నూల్ జిల్లా, తాప్తే హనుమంతు- కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, వేముల అరవింద్ రెడ్డి- హైదరబాద్ కు చెందిన వారు అరెస్టయ్యారు. ప్రస్తుతం శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, గంప సదాశివ్ పరారీలో ఉన్నారు.

Fake seeds gang arrested

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ.. ఒక ముఠాలోని సభ్యులు రైతుల నుంచి తక్కువ ధరకు విడిగా విత్తనాలు కొనుగోలు చేసిన వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శుద్ధి చేసేవారు. శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బిజి.3.ఎచ్ టి పేరుగల పత్తి విత్తనాలు గడ్డి మందును తట్టుకొని, ఎక్కువమార్లు కలుపు తీయాల్సి అవసరం వుందడని, ఈ విత్తనాలు అధికృత డీలర్ల వద్ద విక్రయాలకు ఉండవంటూ రైతులను ఎక్కువ ధరలకు వివిధ రకాల పేరున్న విత్తన కంపెనీల పేర్లతో ఆకర్షణీయంగా ప్యాక్ చేసి వాటిని వరంగల్ నగరానికి తీసుకొచ్చేవారు. ఇక్కడి నుంచి తెలంగాణ, మహారాష్ట్రల్లోని జిల్లాలకు చెందిన విత్తన డీలర్లకు, రైతులకు ఈ ముఠా విక్రయించేవారు. మరో ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు చేదాం పాండు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీగణేష్ విత్తన శుద్ది కంపెనీ వున్నాయి. ఈ కంపెనీ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదాసాగర్ కంపెనీ నుంచి దిగుమతైన విత్తనాలను ఈ కంపెనీల ద్వారా ఉప విక్రయ లైసెన్స్ వుంది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు విత్తనాలు వియించేవాడు. ఇదే అదునుగా భావించిన ఈ నిందితుడు మరికొందరితో కలిసి సులభంగా డబ్బు సంపాధించాలనుకున్నారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు బ్రాండెడ్ కంపెనీ అయిన నర్మద కంపెనీ చెందిన విత్తన ప్యాకెట్లను తీసిపోని విధంగా క్యూఆర్ కొడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, ఎంఆర్పీ తో కూడిన నకిలీ నర్మదా విత్తన ప్యాకెట్ల తయారు చేసిన వీటిలో నకిలీ విత్తనాలు వుంచి ఈ నకిలీ నర్మద కంపెనీ విత్తన ప్యాకెట్లను మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయించేవారు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, మడికొండ, ఏనుమాముల, వ్యవసాయశాఖ అధికారులు రెండు బృందాలు ఏర్పడి బుధవారం నిందితులను అరెస్టు చేశారు. వీరిని విచారించగా నిందితులు పాల్పడిన నేరాలన్ని అంగీకరించారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్ డి,మామూనూర్ ఏసీపీ కృపాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యవసాయ అధికారులు ఉషాదయాళ్, రవీందర్ సింగ్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, అల్లం రాంబాబు, ఎస్.శ్రీనివాస్, వేణు, మహేందర్, ఎస్ఐలు దేవేందర్, భూక్యా చందర్, బండారి సంపత్, శరత్ కుమార్, లవనకుమార్, వి.రాజు, శ్రీకాంత్, ఏఏవో సల్మాన్పషా, టాస్క్ఫోర్స్ సిబ్బంది హెడాకానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, భిక్షపతి,రాజు, శ్యాం సుందర్, సురేష్, మహబూబ్ పాషా, కరుణాకర్, శ్రీ ధర్, విక్రమ్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, వి.శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *