-
ఆ బిల్డర్ నుండి ముడుపులేమైనా తీసుకున్నారా?
-
హన్మకొండ కంచరకుంటలో అనుమతి లేని అపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకోని సిటీ ప్లానర్
-
గరిబోళ్ల నిర్మాణాలు కూల్చేస్తారు.. బిల్డర్ లకు వంతపాడుతారా?
-
గ్రేటర్ లో “పెద్దలకు” ఒకలా.. “పేదోళ్లకు” మరోలా నిబంధనలా?
హన్మకొండ ప్రతినిధి /ప్రజాసర్కార్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో సిటీ ప్లానర్ ఇష్టారాజ్యం నడుస్తోంది. తనకు నచ్చితే ఓ లెక్క.. నచ్చకపోతే మరోలెక్క అన్నట్లు వ్యవహరిస్తుంటాడని కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ కు సిటీ ప్లానర్ గా ఉన్న వెంకన్న “పెద్దలకు” ఒకలా “పేదోళ్లకు” మరోలా టౌన్ ప్లానింగ్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కార్పొరేషన్ పరిధిలో మధ్యతరగతి వారు ఏమాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా ఆఘమేఘాల మీద కూల్చివేసే సిటీ ప్లానర్.. కొందరు బిల్డర్లకు మాత్రం వంతపాడుతారని నగరంలో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను చూస్తే ఈజీగా అర్థమవుతోంది. హన్మకొండలోని కంచరకుంటలో ఓ బడా బిల్డర్ అనుమతి లేకుండా అపార్ట్ మెంట్ నిర్మించిన విషయం సిటీ ప్లానర్ వెంకన్నకు తెలిసినప్పటికీ తనకే మాత్రం పట్టనట్లు వ్యవహరించడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది. అనుమతి లేకుండా నిర్మించరాని ప్రదేశంలో యథేచ్ఛగా ఆ బిల్డర్ అపార్ట్ మెంట్ నిర్మించారంటే సదరు బిల్డర్ కు సిటీ ప్లానర్ ఏ స్థాయిలో సహకారం అందిస్తున్నారో అవగతం చేసుకోవచ్చు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో నిబంధనలను పాటించని సామాన్యుల ఇళ్లను కూల్చడానికి ఆదేశాలిచ్చే సదరు అధికారి.. ఎటువంటి అనుమతి లేకుండా అపార్ట్ మెంట్ నిర్మించిన ఆ అపార్ట్ మెంట్ ను ఎందుకు కూల్చివేయడంలేదో… ? ఆ అపార్ట్ మెంట్ నిర్మించిన బిల్డర్ పై ఎందుకంత ప్రేమో… ? దాని వెనకాల జరిగిన ఒప్పందం ఏమిటోనని పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నట్లు తెలియ వచ్చింది. ఇప్పటికైనా ఇటీవలే ప్రమోషన్ పొందిన సిటీ ప్లానర్ స్పందించి ఆ అనుమతి లేని అపార్ట్ మెంట్ ను కూల్చేయడానికి ఆదేశాలిస్తారా? లేక ఆ బిల్డర్ కే వంతపాడుతారో చూడారా అనేది చూడాలి..!