Illegal sales of scanning machines

అక్రమంగా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాల విక్రయాలు

ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

వరంగల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లింగానిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేయూసి, దామెర పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సూమారు రూ.25 లక్షల విలువగల 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి.రంగనాథ్ వెల్లడించారు.  గత నెలలో అక్రమంగా లింగనిర్ధారణకు పాల్పడుతూ అరెస్టుయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన మల్లిపుడి అశోక్ కుమార్ విజయవాడలో 2012 సంవత్సరం నుంచి ఎమిలిటి కన్సల్టెన్సీ సర్వీస్ ఇంజనీర్ ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో 2018లో విజయవాడలోని అబిరనగర్ ఒక గదిని కిరాయికి తీసుకొని సొంతంగా అష్ట్రానిక్ టెక్నాలజీ పేరుతో బయోమెడికల్ ఎక్విప్మెంట్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశాడు.  వివిధ రకాల బయోమెడికల్ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో పలు ప్రాంతాల్లోని హాస్పటల్స్ కు చెందిన స్కానర్లు మరమ్మతులు  చేయడం ద్వారా సంబంధిత డాక్టర్లతో పరిచయం కావడంతో నిందితుడు అశోక్ కుమార్  ఆయా హస్పిటల్స్ నుంచి పాత స్కానర్లను కోనుగోలు చేసేవాడు. అలాగే నిందితుడు చెన్నై నగరంలో గుర్తింపు లేని బయెమెడికల్ సర్వీస్ కేంద్రాల నుంచి పాత స్కానింగ్ యంత్రాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసేవాడు. ఈ విధంగా కొనుగోలు చేసిన స్కానింగ్ యంత్రాలను ఎక్కువ ధరకు నిందితుడు అర్హతలేని వ్యక్తులకు విక్రయించేవాడు. గతంలో నిందితుడు అశోకకుమార్ వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో స్కానింగ్ యంత్రాల మరమ్మతు చేసే క్రమంలో  వేముల ప్రవీణ్ కు  ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఒక స్కానింగ్ యంత్రాన్ని విక్రయించాడు. ప్రస్తుతం విక్రయించడానికి సిద్ధంగా వున్న మరో 4 పోర్టబుల్. 11 ఫిక్స్ డ్ స్కానింగ్ యంత్రాలను కేయూసి పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో..

నగరంలో డాక్టర్ సబితకు అక్రమంగా స్కానింగ్ యంత్రాన్ని విక్రయించిన మరో నిందితుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన తాతపూడి కిరణ్ కుమార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు 2018 సంవత్సరంలో డేవిస్ మెడికల్ ఎక్యూప్మెంట్ కంపెనీ సెట్స్ మెన్ గా పనిచేయడం ప్రారంభించాడు. సెల్స్ మెస్ గా పనిచేస్తూనే స్కానింగ్ యంత్రాల మరమ్మతులు చేయడం నేర్చుకున్నాడు. 2021 సంవత్సరంలో సెల్స్ మెన్ ఉ ద్యోగాన్ని మానేసి తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం కావలి ప్రాంతంలో పవిత్ర టెక్నాలజీ పేరుతో స్కానింగ్ సర్వీసు సెంటర్ ఏర్పాటు చేసి వివిధ హాస్పిటల్స్ లోని స్కానింగ్ యంత్రాలను మరమ్మతులు చేసేవాడు. నిందితుడు వినియోగానికి అనువుగా లేని స్కానింగ్ యంత్రాలను హస్పటల్ యాజమాన్యం నుంచి కొనుగోలు చేసే వాటిని మరమ్మతులు చేసిన వాటిని తిరిగి ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేవారు. కిరణ్ కుమార్ గతంలో సెల్స్ మెన్ గా హనుమకొండకు వచ్చిపోయే క్రమంలో డాక్టర్ సబితతో ఉన్న పరిచయంతో ఆమెకు ఎలాంటి అనుమతులు లేకుండా లక్ష రూపాయలకు ఒక స్కానింగ్ యంత్రాన్ని విక్రయించాడు. ఇతని నుంచి మరో రెండు పోర్టబుల్, ఒక ఫిక్స్డ్ స్కానింగ్ యంత్రాన్ని దామెర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Illegal sales of scanning machines

పోలీసులకు అభినందన

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్పీ పుష్ప, ఏహెచ్ టియు ఇన్ స్పెక్టర్ సుజాత, కమాండ్ కంట్రోల్ ఇన్స్ స్పెక్టర్ వినయకుమార్, ఎస్ఐ సతీష్ కేయూసీ,  దామెర, నెక్కొండ ఎస్ఐలు సతీష్, రాజేందర్, జానీ పాషా, షేక్, ఫసియుద్దీన్, మల్లేషం, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు, కానిస్టేబుళ్ళు సంపత్, రాజేశ్, రవీందర్, సైబర్ క్రైం కానిస్టేబుల్ రాజు, ఏహెచ్ టియు సిబ్బంది ఏఎస్ఐ భాగ్యలక్ష్మీ, హెడా కానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుల్ శ్రీనివాస్ ను పోలీస్ కమిషనర్ రంగనాథ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *