ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషనర్ రంగనాథ్
హన్మకొండ(ప్రజా సర్కార్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా బాధితులను పలుమార్లు పోలీస్ స్టేషన్ స్టేషన్ కు తిప్పిస్తున్నారనే ఆరోపణలపై కేయూసీ ఇన్ స్పెక్టర్ దయాకర్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకు న్యాయం చేయకుండా బయటి వ్యక్తులతో సెటిల్మెంట్ ప్రయత్నిస్తున్నందుకు విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ రంగనాథ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.