-
ఆర్టీఏ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఆ ఇద్దరు
-
ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు?
-
పైసా ముట్టకుంటే ఫైలు తిరస్కరణే ?
-
డి టి ఓ ను సైతం లెక్కచేయరని కార్యాలయంలో ప్రచారం…
మహబూబాద్ ప్రతినిధి(సర్కార్): మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో బావబామ్మర్దుల హవా జోరుగా సాగుతోందట.జిల్లా డిటిఓ సైతం వారిని చూసిచూడనట్లు వదిలేస్తారట. ఈ కార్యాలయంలో వీరిరువురు చెప్పిందే వేదమట కార్యాలయానికి వచ్చే ఏ వాహనదారుడి ఫైల్ అయినా వీరికి నచ్చుతేనే అప్రూవల్ లేదంటే తిరస్కరణే అని మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోందని తెలుస్తోంది. వీరు ఏ ఫైలు ముట్టుకోవాలన్న(అప్రూవల్ చేయాలన్న)వారికి సంబంధించిన అసిస్టెంట్ కు ముడుపులు చెల్లించాల్సిందేనని కార్యాలయం బయట గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరి వద్దకు వచ్చే ఏ వాహనదారుడైన వీరికి సంబంధించిన అసిస్టెంట్ లను కలిస్తేనే సరి లేదంటే వారు వాహనదారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పని చేస్తారని తెలిసింది.కార్యాలయంలో అవినీతి ని అడ్డుకోవాల్సిన జిల్లా రవాణాఅధికారే అమ్యామ్యాలను దండుకోవడంలో ముందుంటే కార్యాలయం ఉద్యోగులు నిజాయితీగా ఎలా ఉంటారని జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కార్యాలయానికి సంబంధించిన పెద్దసారుకు అమ్యామ్యాలు గట్టిగా ముట్టడంవల్లే సారు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుంటారని అని విశ్వనీయంగా తెలిసింది.
ప్రతి పనికి ఓ రేటు…
లంచాలు ముట్టజెప్పాల్సింది వారికే…?
రోజువారి మామూళ్లు ఎవరికెంత…..?