-
మహబూబాబాద్ ఆర్టిఏలో అడ్డగోలుగా దోపిడీ..?
-
తమ వసూళ్లను అడ్డుకోలేరని అధికారుల ధీమా?
-
అటువైపు కన్నెత్తి చూడని ఏసీబీ అధికారులు..
-
జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ? దోపిడీని అరికడతారా?
మహబూబాబాద్, ప్రజాసర్కార్: మహబూబాబాద్ ఆర్టీఏలో అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే వాహనదారులు నుంచి చుక్కల రూపంలో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి దోపిడీని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదని తెలుస్తోంది. మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ తో పాటు కార్యాలయంలోని ఉద్యోగులు ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకొని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతూ రోజు రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. వీరి దోపిడీ గురించి అడిగేవారు కానీ.. ఆపేవారు కానీ లేకుండా పోయిందని వాహనదారులు లోలోపల కుమిలిపోతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న “జిల్లా కలెక్టర్” అయినా ఈ కార్యాలయంలో జరుగుతున్న దోపిడీపై దృష్టిసారించి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని వాహనదారులు కోరుతున్నారు. కలెక్టర్ ఈ కార్యాలయం పై దృష్టి సారిస్తే కనుక విస్తుపోయే అవినీతి బయటపడక తప్పదని పలువురు “ప్రజా సర్కార్” ప్రతినిధితో చెప్పారు. అసలు కార్యాలయంలో “టెస్ట్ ట్రాక్” లేకుండా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు నడపకుండా ఫిట్ నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారనే విషయాలపై కలెక్టర్ సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులు కు ప్రైవేట్ అసిస్టెంట్ లు గా చెలామణి అవుతూ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసి మొత్తాన్ని అధికారులు అప్పజెప్తున్న “లచ్చిరామ్”, రాజు”, మహేష్” లను కఠినంగా శిక్షించాలని పలువురు వాహదారులు జిల్లా కలెక్టర్ కు “ప్రజా సర్కార్” ద్వారా విన్నవించుకుంటున్నారు. పై విషయాలపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో, కార్యాలయంలో జరుగుతున్న దోపిడిని ఎలా అరికడతారో చూడాల్సిందే..
mahaboobabad News