Mahaboobabad News

మహబూబాద్ ఆర్టీఏ లో టెస్ట్ ట్రాక్ ఎక్కడా?

  • టెస్ట్ ట్రాక్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఎలా సాధ్యం?

  • గ్రౌండ్ లేకుండా వాహన ఫిట్ నెస్ సర్టిఫికెట్ లు జారీ చేస్తున్న జిల్లా రవాణాధికారి?

  • ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీలో వాహనాన్ని బట్టి వసూళ్లు?

  • ” లచ్చి”రాజన్న” కు ముడుపులు చెల్లిస్తే ,ఏ టెస్ట్ అయినా పాస్ అయినట్లే?…

మహబూబాబాద్ ప్రతినిధి(ప్రజాసర్కార్ ): మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా…డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందాలనుకుంటున్నారా… మీ పాత వాహనానికి ఫిట్ నెస్ పరీక్షలు లేకుండానే సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారా… అవునండి నేను చెప్పేది నిజమే పైవన్ని కావాలనుకునేవారు మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళితే చిటికెలో తెచ్చుకోవచ్చు. అదెలా సాధ్యమనకుంటున్నారా ఎందుకంటే అసలు అక్కడ టెస్ట్ ట్రాకే ఉండదు కాబట్టి అసలు వాహనాన్ని నడపాల్సిన పని కూడా లేదు.మీ పాత వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు కూడా ఇక్కడ ఈజీగా పొందొచ్చు ఎందుకంటే ఇక్కడ వాహనాల సామర్థ్య పరీక్షలు కూడా ఉండవు అసలు పరీక్షలు నిర్వహించడానికి ఇక్కడ గ్రౌండ్ లేదు కానీ మీరు మాత్రం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు కంటే అదనంగా డబ్బులు తీసుకెళ్లండి అక్కడ ప్రతిదానికీ ఓ రేటు ఉంటుంది అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ లకు వారు అడిగింది ముట్టజెపితే మీరు ఇట్టే పని చేసుకుని వెళ్లొచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్ నెస్ సర్టిఫికెట్ జారీ ఎలా సాధ్యం..?

డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలంటే నిబంధనల ప్రకారం ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ముందు టెస్ట్ ట్రాక్ లో వాహనం నడిపి ఆ టెస్టులో పాస్ అయితేనే వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలి. కానీ ఈ కార్యాలయంలో అసలు టెస్ట్ ట్రాకే లేదు మరి డ్రైవింగ్ లైసెన్సులు ఎలా జారీ చేస్తున్నారో జిల్లా రవాణాధికారికే తెలియాలి. వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఆ వాహనాన్ని స్వయంగా నడిపి ఆ వాహన సామర్ధ్యం పరిశీలించాకే ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారిచేయాలి.. కానీ ఇక్కడ అవేమి జరగట్లేదు అసలు ఇక్కడ వాహనాన్ని నిలపడానికి స్థలమే లేదు మరి అసలు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు ఎలా జారిచేస్తున్నారో అర్ధంకాని పరిస్థితి.

“లచ్చి “రాజన్న” ను కలిస్తే ఏ టెస్ట్ అయినా పాసే..

ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని జరగాలన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ లు అయినటువంటి “లచ్చి” రాజన్న”లను కలిస్తే ఇట్టే అయిపోతుందట. లేదంటే అధికారులు సవాలక్ష కొర్రీలు పెట్టి మరీ వాహనదారులను ఫెయిల్ చేస్తారట. అంటే వీరిని కలిస్తే ఏ టెస్ట్ అయినా పాస్ అయినట్టే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *