మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయం దోపిడీ పై ఏసీబీ అధికారుల నిఘా కరువైందా…?
ఆర్టీఏ కార్యాలయం పై ఏసీబీ నజర్ వేసేనా?
“లచ్చిరామ్”రాజు”తో పాటు “మహేశ్ “ను పట్టుకుంటే ఆ అధికారుల బాగోతం బయటపడుతోందని ప్రచారం..
అధికారులకు ప్రైవేట్ అసిస్టెంట్ లుగా ఆ ముగ్గురు
ఇప్పటికైనా ఏసీబీ అధికారులు మహబూబాద్ కార్యాలయంలోని దోపిడీని అరికడుతారా?లేదా?
మహబూబాద్ ప్రతినిధి(ప్రజాసర్కార్): మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ నిఘా కరువైందా… కార్యాలయంలో జరుగుతున్న దోపిడీపై ఏసీబీ అధికారులు నజర్ వేస్తారా…మామూళ్ల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రణాళికలు రచిస్తారా …అనే ప్రశ్నలు ఇప్పుడు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనదారుల్లో మొదలైనట్లుగా తెలుస్తోంది. రవాణాశాఖ కార్యాలయంలో చుక్కల పేరుతో రోజు వాహనదారుల నుండి ఒక్కోపనికి ఒక్కో రకంగా దోచుకుంటున్నారు.ఈ తతంగం అంతా కూడా అక్కడ ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ లతోనే నడుస్తుందని తెలుస్తోంది.కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుండి మామూళ్ల రూపంలో వసూళ్లు చేసే ఈ ప్రైవేట్ అసిస్టెంట్ లు వసూళ్లు చేసిన మొత్తాన్ని సాయంత్రం కాగానే అధికారులకు పువ్వుల్లో పెట్టి వారు చెప్పినవారికి అందజేస్తారని సమాచారం. ఇంత బహిరంగంగా వాహనదారుల నుండి వసూళ్లకు పాల్పడుతున్నా వీరిపై ఎందుకు చర్యలు ఉండటం లేదోనని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ఈ కార్యాలయం పై నిఘా ఉంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు ప్రైవేట్ అసిస్టెంట్ లతో పాటు వారితో వసూళ్లు చేపిస్తున్న అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు .
ఆ ముగ్గురే కీలకం…
మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని కావాలన్న అక్కడ ప్రైవేట్ అసిస్టెంట్ లుగా ఉన్న ఆ ముగ్గురిని కలవాల్సిందే ..మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు, కార్యాలయ ఉద్యోగులకు వీరు ముగ్గురే వాహనదారుల నుండి వసూళ్లు చేసి ఇస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు కార్యాలయంలోని అధికారుల దోపిడీని అరికట్టాలంటే ప్రైవేట్ అసిస్టెంట్ లు అయినటువంటి “లచ్చిరామ్”, “రాజు” తోపాటు “మహేశ్” ను పట్టుకుంటే అధికారుల అక్రమ వసూళ్ల బాగోతం బట్టబయలు అవుతుందని విశ్వసనీయ సమాచారం