mahaboobad district news

మానుకోట జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పేరుమండ్ల సంకీస గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. పసుపు బియ్యం, బొమ్మ, వెంట్రుకలు, సూదులతో కొందరు క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతున్నారు. గతంలో కూడా క్షుద్రపూజలు చేయడం వల్లే తమ పెంపుడు కుక్క చనిపోయిందని మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో ప్రస్తుతం పేరుమండ్ల సంకీస గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. క్షద్రపూజలపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *