చెరువుల్లోని మట్టిని అక్రమంగా తవ్వడంలో దిట్ట
ఎండాకాలం వచ్చిందంటే లక్షల రూపాయల మట్టిని కొట్టుకుపోతున్న సదరు వ్యక్తి ?
చెరువులను తవ్వుతాడు మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తాడు
ప్రజాప్రతినిధులను,ప్రభుత్వ ఉద్యోగులను మచ్చిక చేసుకుని తవ్వకాలు
ప్రజా సర్కార్/ హన్మకొండ: అవును అతను అనుకుంటే ఏ చెరువు మెట్టినైనా దోచుకోగలడు… అతని కన్నుపడితే ఏ చెరువులోని మట్టినైనా ఇట్టే తవ్వగలడు ఆయన కన్నుపడితే ఎంత పెద్ద చెరువైనా ఖతం కావాల్సిందే..ఎండాకాలం వచ్చిందంటే చాలు అతగాడి తవ్వకాలకు అడ్డూ అదుపు ఉండదు …గత కొన్నిసంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుంటూ చెరువుల్లోమట్టిని అక్రమంగా తవ్వుతూ ఆ మట్టిని నక్కలపల్లి ఇటుక బట్టీలకు తరలించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ మట్టి మాఫియా కింగ్ గా అవతరించిన “మోయినోద్దీన్” పై ప్రజాసర్కార్ అందిస్తున్న ప్రత్యేక కథనం..”మోయినోద్దీన్ ” ఈ పేరు వింటేనే కళకళలాడే చెరువుల్లో ఓ అలజడి మొదలవుతుంది తనపై(చెరువుపై)ఎప్పుడు హిటాచీలతో దాడి చేస్తాడో, తన నుండి ఎప్పుడు రాగడి మట్టిని వేరుచేస్తాడో అనే భయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెరువుల్లో ఉన్నట్లు పర్యావరణ ప్రేమికులు చెప్పుకుంటున్నారు.ప్రతి సంవత్సరం ఎండాకాలం లో మొదలయ్యే ఈ మట్టిమాఫియా కింగ్ దందా ఇప్పుడు హన్మకొండ జిల్లా ఊరుగొండ కే ఎస్ ఆర్ స్కూల్ వద్ద నున్న చెరువుపై పడ్డట్లు తెలుస్తోంది . స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఆ చెరువులోని మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా తవ్వి టిప్పర్ లతో నక్కలపల్లి ఇటుకబట్టిలకు తరలిస్తున్నట్లు సమాచారం. నక్కలపల్లి ఇటుక బట్టిల యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకునే ఈ “మోయిన్” ట్రిప్పుకు ఓ రేటు మాట్లాడుకొని ఇటుక బట్టిలకు సరిపడా మట్టిని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత బహిరంగంగా ములుగు జాతీయ రహదారి పక్కనే చెరువులో మట్టితవ్వకాలు చేపడుతున్న ఇప్పటివరకు సంబంధిత రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.