“పెద్ది” ఇంట్లో టికెట్ పోరు?
పెద్దికి వర్గపోరు లేదు? కానీ ఇంటి పోరు తప్పదా?
పెద్ది సతీమణి “స్వప్న”కే టికెట్ అంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం…?
పొలిటికల్ బ్యూరో/ప్రజాసర్కార్: నర్సంపేట ఎమ్మెల్యే కు టికెట్ గండం తప్పదా ….రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పెద్దికి నో చెప్తారా… ఆయన సతీమణి “స్వప్న “వైపు బి ఆర్ ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోందా? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి “స్వప్న” నేనా అనే ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి నర్సంపేట బి ఆర్ ఎస్ లో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎదురు లేదు ,కనీసం అక్కడ వర్గపోరు కూడా లేదు కానీ పెద్దికి టికెట్ విషయంలో ఇంటిపోరు తప్పదని ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఆయనకంటే వారి సతీమణి అన్ని సర్వేల్లో ముందు ఉన్నారని ఆయనకు” టికెట్ గండం” తప్పేలా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నర్సంపేట ఎమ్మెల్యే గా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆక్టీవ్ గా ఉన్నప్పటికీ సామాన్యులనుండి మన్ననలను పొందడంలో విఫలం అయ్యారనేది కాదనలేని సత్యం.పెద్ది సతీమణి అయినటువంటి “పెద్ది స్వప్న” ఒక మండలానికి జడ్పిటిసి గా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు , ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.పెద్ది స్వప్న రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే జనాకర్షక నేతగా ఎదిగిందని చెప్పక తప్పదు .రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఎదుర్కోని బి ఆర్ ఎస్ నిలబడాలంటే పెద్ది కి కాకుండా ఆయన సతీమణి కే టికెట్ కేటాయించాలని సామాన్య కార్యకర్తలు కొన్ని సర్వేల్లో తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నట్లు ప్రస్తుతం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న పెద్దిని కాదని తన సతీమణి “స్వప్న” కు అధిష్టానం టికెట్ కేటాయిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే…