- తెలంగాణ పవర్ డిప్లోమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
- ప్రారంభించిన సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బాసిరెడ్డి, జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వరరావు
హన్మకొండ, ప్రజాసర్కార్: మే డే ని పురస్కరించుకుని హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయ మెయిన్ గేట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథులుగా సీఎండీ గోపాలరావు, అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బాసిరెడ్డి, జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వరరావు హాజరై ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. కార్మికులు, కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్, శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ తో పాటు టీఎస్ఎన్పిడీసీఎల్ జనరల్ సెక్రెటరీ, ఉమ్మడి వరంగల్ జిల్లా సర్కిల్ సెక్రెటరీలు మల్లికార్జున్, వంశీకృష్ణ, రాజు, సతీష్ వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు టీఎస్ఎన్ పిడిసిఎల్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, మోహన్ రెడ్డి సీజీఎంలు మధుసూదన్ తిరుపతిరెడ్డి, చౌహన్ తదితరులు పాల్గొన్నారు . చలివేంద్రం ప్రారంభించిన అనంతరం తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ బాసిరెడ్డి, జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
TS NPDCL News