warangal RTA news

అక్రమ వసూళ్లతో మాకు సంబంధం లేదు..

  • వాహదారులెవరూ దళారులను సంప్రదించవద్దు
  • ఆన్ లైన్ చేసుకుని నేరుగా కార్యాలయంలో సంప్రదించాలి
  • ఉద్యోగుల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే మా దృష్టికి తీసుకురండి
  • వరంగల్ ఎంవీఐ కోల రవీందర్

వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: వాహనదారులు ఎవరూ కూడా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆర్టీఏ కార్యాలయంలో ఏ పని ఉన్న దానికి సంబంధించిన ప్రభుత్వ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించి నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని వరంగల్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ కోల రవీందర్ అన్నారు. గత రెండు రోజులుగా ప్రజాసర్కార్ లో వస్తున్న వరుస కథనాలపై ఆయన స్పందించారు. ‘మేమెప్పుడూ కూడా వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడలేదని, మా పేరుతో ఎవరైనా  వసూళ్లకు పాల్పడితే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కి ఆస్కారం లేదని, వాహదారులకు సేవలందించడం తమ విధినిర్వహణలో భాగమని స్పష్టం చేశారు.  దళారులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలని ఎంవీఐ రవీందర్ వాహనదారులకు పిలుపునిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *