Warangal RTA Office

మేడం జీ.. జర దేఖో?

  • అవినీతికి అడ్డాగా మారుతున్నఆర్టీఏ కార్యాలయం
  • మీరేమో నిజాయితీ… మీ కింది ఉద్యోగులేమో అవినీతికి కేరాఫ్?
  • “ముడుపులు”లేనిదే ఫైల్ కదపని పరిస్థితి ?
  • రోజుకు రూ.లక్షల్లో  అవినీతి .. మీ ముందు సత్యహరించంద్రుల్లా నాటకం?
  • వరంగల్ ఆర్టీఓ మేడం కు కనపడని కార్యాలయం లోపల, బయట వసూళ్లు?

వరంగల్ ప్రతినిధి/ప్రజాసర్కార్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ లో విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో వరంగల్ ఆర్టీఓ ది ప్రత్యేకమైన చరిత్ర. సాధారణంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి అనేది బహిరంగ రహస్యం.. కానీ ఇప్పటివరకు “అఫ్రిన్ సిద్దిఖీ”(వరంగల్ ఆర్టీఓ) ఏ జిల్లాలో విధులు నిర్వహించినా కూడా అవినీతి రహిత పాలన అందించడం ఆమె నైజం. అలాంటి అధికారి ఉండటం ఆర్టీఏ చరిత్రలో అరుదు. ఆమె నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం.. కానీ అలాంటి అధికారి కి కూడా తెలియకుండా ఆమె పాలనను అబాసుపాలు చేసే పనిలో పడ్డారు వరంగల్ ఆర్టీఏ కార్యాలయ ఉద్యోగులు ఎంవీఐలు.

నిత్యం కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి కార్యాలయం బయట ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకొని మరీ చుక్కల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారట. ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసి, రోజుకు అందినకాడికి దండుకుంటున్నారట. ఆర్టీఓ మేడం చాలా “స్ట్రిక్ట్” ఇక ఈ కార్యాలయంలో మామూళ్ల తో పని కాదు అని మొదట ప్రచారం చేసిన వీరే (కార్యాలయ ఉద్యోగులు, ఎంవీఐలు) ఆర్టీఓ కళ్ళుగప్పి వసూళ్లకు తెగపడుతున్నారు. సాయంత్రం “ఆర్టీవో” మేడం కార్యాలయం (Warangal RTA Office ) నుండి వెళ్లిపోగానే ఉద్యోగుల వసూళ్ల పర్వం మొదలవుతుందని విశ్వసనీయంగా తెలిసింది. ఇక ఎంవిఐ లేమో ఆర్టీఓ కు తెలియకుండా కార్యాలయం బయట ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకొని వాహనదారుల నుండి వసూళ్లకు పాల్పడుతున్నారట. వీరందరూ రోజుకు లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతూ ఆర్టీఓ వద్ద సత్యహరించంద్రుల వలే ఫోజులు కొడుతున్నారట. నిజాయితీ కి మారుపేరుగా ఉన్న “ఆర్టీఓ” ఆ కార్యాలయం లోపల బయట జరుగుతున్న అవినీతి పై ఓ లుక్కేయాలని అవినీతి కి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వాహదారులు కోరుకుంటున్నారు. ఆ వసూళ్లపై మేడం జీ జర దేఖో అంటున్నారు. నీతి నిజాయితీ కి మారుపేరుగా ఉన్న వరంగల్ ఆర్టీవో ఈ వసూళ్లకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాల్సిందే…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *