కాంగ్రెస్ లో నాయిని వర్సెస్ జంగా
బీజేపీ టికెట్ రేసులో రావు పద్మ, రాకేష్ రెడ్డి
జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న వినయ్ భాస్కర్
కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులపై స్పష్టత కరువు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బాద్ షా ఎవరు ?
పొలిటికల్ బ్యూరో,(ప్రజాసర్కార్): వరంగల్ పశ్చిమ పీఠం ఎవరికి దక్కనుంది… రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆ పీఠం పై కూర్చోబెట్టనున్నారు…నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది… కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బి ఆర్ ఎస్ పార్టీని ఓడించడం సాధ్యమేనా కాంగ్రెస్, బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో అంతిమంగా ఎవరికి లాభం చేకూరనుంది. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేకు డబుల్ హ్యాట్రిక్ సాధ్యమేనా ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోందట .నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ కు ఎదురుండదని కాంగ్రెస్ ,బిజెపి పార్టీల అంతర్గత కుమ్మలాటలు వినయ్ భాస్కర్ కు కలిసొస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ లో నాయిని వర్సెస్ జంగా
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరేలా ఉన్నాయనేది కాదనలేని సత్యం. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం నాయిని రాజేందర్ రెడ్డి ,జంగా రాఘవరెడ్డిల మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో పోటాపోటీగా ఈ ఇద్దరు నేతలు హాత్ సే హత్ జోడో యాత్ర చేయడం ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ దుమ్మెత్తిపోసుకోవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోందట టిక్కెట్ జంగా రాఘవరెడ్డి కే అని కొంతమంది లేదు మా నాయకుడు రాజేందర్ రెడ్డికే అని మరికొందరు ప్రజల్లో ప్రచారం చేసుకుంటుంటే సామాన్య కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ మరింత పెరుగుతుందని తెలుస్తోంది.వీరిరువురు వల్ల కాంగ్రెస్ గెలవడం పక్కన పెడితే పార్టీ మరింత బలహీన పడుతుందని మెజారిటీ కార్యకర్తలు లోలోపల మదనపడుతున్నారట. చూద్దాం ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపడితే కనుక నియోజకవర్గంలో కాంగ్రెస్ ను తట్టుకోవడం కష్టమే.
బిజెపి లో రావు పద్మ వర్సెస్ రాకేష్ రెడ్డి..
గతంలో ఈ నియోజకవర్గంలో బిజెపి హవా గట్టిగానే ఉండేదట అప్పట్లో ఇక్కడ బిజెపి అభ్యర్థి మార్తినేని ధర్మారావు ఎమ్మెల్యే గా సైతం గెలిచాడు.కానీ ప్రస్తుతం బిజెపి ప్రభావం నామమాత్రమే అని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ ,రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మధ్య టికెట్ పోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం .ఇప్పుడిప్పుడే జిల్లాలో బలపడేందుకు ప్రయత్నం చేస్తున్న బిజెపి కి టిక్కెట్ వార్ తో లాభం కంటే ఎక్కువగా నష్టాలే ఉండనున్నట్లు సగటు సామాన్య కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బిజెపి అధిష్టానం ముందస్తుగా అభ్యర్థి పై స్పష్టతను ఇస్తే కనుక బిజెపి నియోజకవర్గంలో మరింత బలపడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
దూసుకెళ్తున్న వినయ్ భాస్కర్…
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు సార్లు గెలిచిన వినయ్ భాస్కర్ డబుల్ హ్యాట్రిక్ కొట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం వినయ్ భాస్కర్ కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండటం వారందరిలో వినయ్ భాస్కర్ మా పేదోళ్ల లీడర్ అని పేరు రావడం ఆయనకు మరింత కలిసొస్తుందనేది బి ఆర్ ఎస్ కార్యకర్తలు గట్టిగానే నమ్ముతున్నారు .కాంగ్రెస్, బిజెపి పార్టీల అంతర్గత కుమ్ములాటలు కూడా వినయ్ భాస్కర్ గెలుపునకు దోహదపడతాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచిన వినయ్ కి డబుల్ హ్యాట్రిక్ సాధించడం సులభమేనని మెజారిటీ ప్రజల అభిప్రాయం.